బుచ్చయ్యపేట :రాజాం జంక్షన్ లో భారీ కొండచిలువ హాల్ చల్

60చూసినవారు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కేబీరోడ్డులో రాజాం జంక్షన్‌లో శుక్రవారం రాత్రి భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. 12 అడుగుల పైబడి పొడవు ఉండే కొండచిలువ కేబి రోడ్డులో కొంతసేపు హాల్ చల్   చేసింది.
అటుగా వస్తున్న వాహనదారులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వాహనాలు కొంతసేపు ఆపి నిలిచిపోయారు. కొండ చిలువ రోడ్డు మీదుగా పొలాల మధ్యకు వెళ్ళిపోయిందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్