విశాఖ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మెరుగైన వసతులను, అవకాశాలను పొందటమే లక్ష్యంగా సంఘం పని చేస్తుందన్నారు. అనంతరం జామి పద్మావతి సంఘ రాష్ట్ర ప్రధాన కార్య దర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.