విశాఖ పోర్టు ట్రస్టు ప్రాంతంలో సరికొత్త రంగులతో విద్యుత్ కాంతులతో రోడ్డు సైడ్ వాల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీవీఎంసీ సహకారంతో గోడలపై వివిధ చిత్రాలు ప్రయాణికులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పరిశసరాల శుభ్రతతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న గోడలపై పెయింటింగ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట విద్యుత్ వెలుగుల్లో ఇవి మరింత ఆకర్షణగా మారాయి.