విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 79, 95, 116 విరాళం అందించింది. శుక్రవారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసి దీనికి సంబంధించిన చెక్‌ను ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్ ధనుంజయరావులు అందజేశారు. వరద బాధితుల సహాయార్ధం ఏయూ బోధన, బోధనేతర ఉద్యోగులు, పెన్షనర్లు స్వచ్ఛందంగా ఈ నిధులను అందించినట్లు మంత్రి లోకేష్ కి ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు.