Oct 31, 2024, 05:10 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్
సికింద్రాబాద్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Oct 31, 2024, 05:10 IST
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లాలగూడ – మౌలాలి రైల్వే స్టేషన్ ల మధ్యన ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు నుంచి జారి పడినట్లుగా, తలకు బలమైన గాయాలు అయ్యి అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, నల్లని ప్యాంటు, నల్లని ఫుల్ షర్ట్ ధరించినట్లు పేర్కొన్నారు.