నర్సీపట్నంం: జగన్‌పై సీబీఐ, ఏసీబీ విచారణ చేయాలి: అయ్యన్న

72చూసినవారు
నర్సీపట్నంం: జగన్‌పై సీబీఐ, ఏసీబీ విచారణ చేయాలి: అయ్యన్న
వైసీపీ అధినేత జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన అవినీతిపై సీబీఐ, ఏసీబీ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అదానీతో కాకుండా సెకీతో ఒప్పందం చేసుకున్నామని వైసీపీ ప్రకటించింది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ.. అదానీ కేసుతో సెకీకి సంబంధం లేదని తెలిపింది. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి నష్టం చేకూరింది. ప్రజలపై విద్యుత్ భారం పడింది. దీనిపై చర్యలు తీసుకోండి.’ అని అయ్యన్న అన్నారు.

సంబంధిత పోస్ట్