నాతవరం: జనసేన జెండా ఆవిష్కరణ

60చూసినవారు
నాతవరం: జనసేన జెండా ఆవిష్కరణ
నాతవరం మండలం చినగొలుగొండపేటలో ఆదివారం జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామగ్రామాన జనసేన పార్టీ బలోపేతమైందన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సీపట్నం కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, మున్సిపాలిటీ అధ్యక్షుడు అద్దేపల్లి గణేశ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్