అల్లూరి జిల్లా మన్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గూడెంకొత్తవీధి మండలంలోని దేవరపల్లి పంచాయతీ పరిధి కోట్నాపల్లి తదితర గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భోగి పండుగ వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. గిరిజనులు వేకువజామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకున్నారు. ఇదే తరహా సందడి వాతావరణం మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు కుటుంబ సమేతంగా ఆటలు పాటలతో చిందులేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు.