పాడేరు మండలంలోని కాడేలి పంచాయతీ పరిధి గురుపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం నాడు గ్రామంలోని మహిళలు పాటలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం గ్రామంలోని గిరిజనులందరూ కలిసి ఆదివాసి థింసా నృత్యం ప్రదర్శిస్తూ సందడి చేస్తూ ఉర్రుతలూగించారు.