Mar 18, 2025, 15:03 IST/
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం
Mar 18, 2025, 15:03 IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం ఈడీకి చేరింది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోంది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ చేయనుంది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తోంది. దీంతో 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.