కేంద్ర తీసుకువచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని రాజ్యసభలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక ( PLI) పథకాల కింద ఇప్పటివరకు 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాదాపు 9.5 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రకటించారు.