రేపు ఉ. 9.30 గంటలకి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశమవనుంది. ఈ మీటింగ్‌లో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉ.11.14కి బడ్జెట్ ప్రవేశబెట్టనున్నారు. ఈ బడ్జెట్‌తో భట్టి మూడో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. రేపు రూ. 3.20 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశబెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది.