ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రాణాలు అర్పించిన వారికి అసెంబ్లీ సాక్షిగా నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'SC వర్గీకరణకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. రాజకీయాలు పక్కనబెట్టి అందరూ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా నా మనసుకు చాలా దగ్గరైన అంశం ఇది. 2004లో తొలిసారి వర్గీకరణ చేపట్టాలని YSR అసెంబ్లీలో తీర్మానం చేశారు' అని వ్యాఖ్యానించారు.