నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో అరెస్టైన పోసాని ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసు కస్టడీ ముగించుకుని పోసాని జైలులోకి వెళుతున్న సందర్భంగా సీఐడీ అధికారులు ఆయనతో పొటోలు దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.