పరవాడలో జోరుగా కోడిపందాలు
పరవాడ మండలం ఈదులపాక బోనంగి పరిధిలో కత్తులు కట్టి కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఫార్మా నిర్వాసిత కాలనీ సమీపంలోని వుడా లే అవుట్ స్థలంలో బరులు ఏర్పాటు చేసి, టెంట్లు వేసి, కోడి పందేలు, గుండాటలను మంగళవారం నిర్వహించారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయని వినిపిస్తోంది.