పెందుర్తిలో శనివారం సాయంత్రం 6గంటలకు తప్పిపోయిన ఓ రెండేళ్ల పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. రాత్రి 1గంట సమయంలో ఓ చెరువు ఒడ్డున అనుమానాస్పద రీతిలో కనిపించింది. సీసీ కెమెరా, డ్రోన్ సాయంతో సిబ్బంది పరుగులు పెట్టారు. కాగా రాత్రి వేళ తుప్పల్లో సైతం పోలీసులు ఆరా తీశారు. ఎట్టకేలకు పాప కనిపించేసరికి పోలీసులు, పాప కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.