AP: నిన్న ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విజయవాడ పటమటకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని రాజేశ్వరికి ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఆమె ఫెయిలయ్యారు. సంస్కృతం-98, మ్యాథ్స్ 2ఏ-73, 2బీ-75, ఫిజిక్స్-60, కెమిస్ట్రీ-60, 2 ప్రాక్టికల్స్‌లో 60 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో కేవలం 5 మార్కులే వచ్చినట్లు లిస్టులో ఉంది. కష్టపడి చదివినా ఇంగ్లీష్‌లో 5 మార్కులు రావడం ఏంటని రాజేశ్వరి ప్రశ్నించారు.