వివాహితుల్లో డిమెన్షియా వచ్చే అవకాశాలు సింగిల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ 18 ఏళ్ల పరిశోధనలో తేలింది. 24 వేల మంది అమెరికన్లపై చేసిన అధ్యయనంలో పెండ్లి కానివారికి లేదా విడాకులు పొందినవారికి మతిభ్రంశం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. గత అధ్యయనాలు పెండ్లి మంచిదని చెబితే, ఇది భిన్నంగా ఉంటుంది. ఈ విషయంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని నిపుణులు భావిస్తున్నారు.