వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పెందుర్తి మండలం వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు హామీ ఇచ్చారు. ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ పాల్గొన్నారు.