Feb 10, 2025, 09:02 IST/
ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రామీణ వైద్యుల ధర్నా
Feb 10, 2025, 09:02 IST
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రామీణ వైద్యులు సోమవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని, తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలను హెల్త్ గైడ్లుగా గుర్తించాలని వారు నిరసన చేపట్టారు.