షేక్ పేట్: నూతన బోర్వెల్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి

58చూసినవారు
ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం షేక్ పేట్ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్లో పర్యటించారు. స్థానికంగా నూతన బోర్వేల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. బోర్వెల్ తో స్థానికంగా మంచి నీటి సరఫరా సమస్యలు ఉండవన్నారు. బొర్వెల్ నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్