విశాఖ: నమస్తే పథకంలో నమోదు కావాలి

62చూసినవారు
విశాఖ: నమస్తే పథకంలో నమోదు కావాలి
విశాఖ నగర పరిధిలో సెప్టిక్ ట్యాంక్ కార్మికులు నమస్తే పథకంలో నమోదు కావాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ కార్మికుల జీవన భద్రత, మెరుగైన ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని అన్నారు. నమోదు చేసుకోకుండా సెప్టిక్ ట్యాంకు కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని నిషేధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్