ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురజాడ జయంతి

79చూసినవారు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురజాడ జయంతి
విశాఖ నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఐద్వా, పీఎన్ఎం, డివైఎఫ్ఐ తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు గురజాడ అన్నారు. 150 ఏళ్ల కిందటే సమాజాన్ని జాగృతం చేసి మేల్కొల్పారని అన్నారు.

సంబంధిత పోస్ట్