ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రగతి రథచక్రాలపై పయనిస్తోందని బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు చెప్పారు. సోమవారం సాయంత్రం బ్యాంకు మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్లు సుమారు రూ. 4154 కోట్లకు చేరుకోగా అడ్వాన్సులు రూ. 2206 కోట్లకు చేరుకున్నాయి. కొత్తగా సభ్యుల కోసం సామూహిక ఆరోగ్య సంక్షేమ పథకం ప్రారంభించామని చెప్పారు.