విశాఖ: టిడిపి ఆవిర్భావంతోనే తెలుగు జాతికి గుర్తింపు
విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు చిన్నజాలారి పేటలో జరిగిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ శనివారం ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు. టిడిపి ఆవిర్భావంతోనే తెలుగు జాతికి గుర్తింపువచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.