అచ్యుతాపురం సెజ్‌లోని అభిజిత్ ఫెర్రో టెక్ కార్మికుల సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించకుంటే వి సెజ్ ప్రధాన కార్యాలయం ఎదుటే వంటా వార్పు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. లోకనాథం హెచ్చరించారు. అచ్యుతాపురం సెజ్‌లోని అభిజిత్ ఫెర్రో టెక్ కంపెనీ అక్రమంగా లే ఆఫ్ ప్రకటించడాన్ని నిరసిస్తూ వి సెజ్ కార్యాలయం ఎదుట కార్మికులు శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు.