యలమంచిలి బైపాస్ రోడ్డులో పైప్ లైన్ దెబ్బతినడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టినట్లు మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ విభాగం ఏఈ గణపతి రావు తెలిపారు. 140 ఎంఎం పైప్ లైన్ పగిలిపోవడంతో ఆదివారం అయినా మరమ్మతులు చేపడుతున్నామన్నారు. పట్టణంలో ధర్మవరం ప్రాంతానికి మినహా మిగిలిన ప్రాంతానికి సోమవారం ఉదయానికి తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. ధర్మవరానికి టాంకర్స్ తో సరఫరా చేస్తామన్నారు.