AP: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసన కార్యక్రమాలు చేపడతామని స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య తెలిపారు. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో వాలంటీర్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రేపు గ్రామ, వార్డు సచివాలయం అడ్మిట్‌లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన, 4న వెనకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.