కొత్త సంవత్సరంలో అదృష్టం, ఐశ్వర్యం రావాలంటే కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. 31న ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దక్షిణ దిక్కులో ఓ పీట ఏర్పాటు చేసి దానిపై బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. దాని మధ్యలో ప్రమిదను పెట్టి దీపారధన చేయాలి. ఇంకా నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. 31వ తేదీన అర్ధరాత్రి లక్ష్మీదేవి పటానికి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటున్నారు.