టోల్ ఫ్రీ నెం 155251కు 9.52 లక్షల మంది రైతుల నుంచి వచ్చిన సమస్యలు, సందేహాలను నివృత్తి చేశామని వ్యవసాయశాఖ మంత్రి
కె.అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పాడి పంటలు’ యూట్యూబ్ చానల్ ద్వారా రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి వ్యవసాయ సూచనలు, సలహాలు అందిస్తున్నామని తెలిపారు. దీనికి 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని, ఈ మాస పత్రికకు 54,738 మంది చందాదారులు ఉన్నారని చెప్పారు.