ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో బాణసంచా కాల్చడంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. రా మెటీరియల్ మాత్రమే సీజ్ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరు 25లోగా వ్యాపార వర్గాలను సంప్రదించి శాశ్వతంగా బాణసంచాను నిషేధించే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని, పోలీస్ కమిషనర్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.