ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరైవధూవరులను ఆశీర్వదించారు. గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.