క్రిస్మస్ పండుగ రోజు లేవగానే కాసేపు మోకరించి ప్రార్ధన చేయండి. ఈ ఏడాదిలో మీరు ఎవరినైనా బాధపెడితే ముందుగా మీ ప్రభువైన యేసయ్యను క్షమించమని అని కోరండి . అనంతరం మీకు సమీపంలోని ఉన్న చర్చికి వెళ్లి మళ్ళీ మీ దేవుడిని ఆరాధించండి. చర్చిలో ఒకరికొకరు విషెస్ చెప్పుకోండి. చర్చ్ అయిన తరువాత మీ కుటుంబంతో సంతోషంగా గడపండి. అలాగే ఆ రోజు మద్యం సేవించి మీ కుటుంబీకుల పరువుని తీయకండి. దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించండి.