ఒక టీ స్పూన్ మెంతులను 1 గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయం కాస్త వేడిచేసి వడకట్టి తాగాలి. 15 రోజులు ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే, కొవ్వు కరిగి వేగంగా బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు అరుగుదలకు సహాయపడి, మలబద్ధకాన్ని, ఎసిడిటీని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుంది. చర్మం, జుట్టు సంరక్షణ, గుండె ఆరోగ్యం, పీరియడ్స్ నియంత్రణలో మెంతులు సహాయపడతాయి.