ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో నేటి నుంచి మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఇక రాయలసీమలో నేడు మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.