మాజీ ఎమ్మెల్యే ఆర్. ఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన అంగర

70చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ఆర్. ఎస్ పార్థివదేహానికి నివాళులర్పించిన అంగర
పేదల పక్షాన నిరంతరం పోరాడి కమ్యూనిస్టు ఉద్యమాల్లో అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్. ఎస్) అని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. శుక్రవారం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలోని ఆర్. ఎస్ ఇంటికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంగర మాట్లాడుతూ ఆర్. ఎస్ మరణం తనను కలచి వేసిందన్నారు. ఆర్. ఎస్ గొప్ప ఉద్యమ నేత అంటూ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్