ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌ ఇంట్లో ఈడీ సోదాలు

58చూసినవారు
ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌ ఇంట్లో ఈడీ సోదాలు
కోల్‌కతా మహిళా డాక్టర్‌ హత్యాచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్‌, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. హత్యాచారం జరిగిన ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్‌ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్