దువ్వలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

85చూసినవారు
తణుకు మండలం దువ్వ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అనేక హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా పెన్షన్లు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటివి చేసిందన్నారు.