జంగారెడ్డిగూడెం: డయాబెటిక్ రోగులకు HbA1c పరీక్షలు

68చూసినవారు
జంగారెడ్డిగూడెం: డయాబెటిక్ రోగులకు HbA1c పరీక్షలు
జంగారెడ్డిగూడెం పట్టణం ప్రభుత్వ వైద్యులు సల్మాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది గురువారం ఉదయం షుగర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా గౌరీ శంకరపురం సచివాలయం పరిధిలో గల ప్రతి ఇంటికి వెళ్లి HbA1c పరీక్షలు నిర్వహించారు. డయాబెటిక్ రోగులలో HbA1c పరీక్ష చేయించుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంగ, సుదీప ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్