తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటుచేసింది. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. మే 10 నుంచి 14 వరకు థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.