కామవరపుకోట మండలంలో జరిగిన కోడిపందేల బరిలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక పందెం గెలుపు, ఓటముల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఈ ఘర్షణకు కారణమని చెబుతున్నారు. పందేన్ని పెద్దలు సమం చేసినప్పటికీ ఒకరికి ఒకరు మాటలు అనుకోవడంతో ఘర్షణ పడ్డారు. నిర్వాహకులు లైట్లు ఆపి పందేలను నిలిపివేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివాదం సద్దు మణిగేలా చేశారు.