గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన

66చూసినవారు
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన
చింతలపూడిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు, ఇటీవల ఎర్రగుంటపల్లిలోని వార్డెన్ అకృత్యాలు చూస్తుంటే తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో శనివారం ఎస్పీ శివ కిషోర్ ఆదేశాల మేరకు సీఐ రవీంద్ర, ఎస్సై కుటుంబరావులు మండలంలోని నాగిరెడ్డి గూడెం బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్