ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి తాను బతికే ఉన్నానంటూ. శుక్రవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్‌ను ఆశ్రయించింది. తాను చనిపోయినట్లు చూపించి 70 సెంట్లు భూమిని భలే హానొక్ పేరుపై మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాణి చనిపోయినట్టుగా 2012లో డెత్ సర్టిఫికెట్‌పై సాక్షి సంతకాలు పెట్టిన ఘంటసాల నాగార్జున, సైదు వీరయ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.