ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి జ్వాలాతోరణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. గంగా, పార్వతి సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను పల్లకి వాహనంలో ఉంచి అర్చకులు, పండితులు పుష్పాలంకారాలు చేశారు. ఆలయ ఈవో జ్వాల తోరణాన్ని వెలిగించగా స్వామివారి పల్లకి వాహనాన్ని తోరణం కింద నుంచి ప్రదక్షిణలు నిర్వహించారు.