దీపం పధకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అక్టోబరు 31 నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి శ్రీ రెడ్డి అన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అలాగే గ్యాస్ ఏజెన్సీలు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కంట్రోల్ రూమ్ నెం. 7702003584 మరియు టోల్ ఫ్రీ నెం. 18004256453 సంప్రదించాలన్నారు.