ప్రజా వినతులు స్వీకరించడంతో పాటూ, ఆయా సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. సోమవారం పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వినతులందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులని ఆదేశించారు.