ఏలూరు జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 33 కోట్లు కూటమి ప్రభుత్వం ఆదివారం కేటాయించింది. మొత్తం 541 పంచాయతీలుండగా ఎన్నికలు జరగని సొప్పరాయునిగూడెం, గవరవరం, ఎల్ఎన్ పేటలకు మాత్రం విడుదల కాలేదు. జిల్లాలోని 544 పంచాయతీల్లో సుమారు 80 శాతం పంచాయతీలు ఆర్థిక ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం బ్లీచింగ్ చల్లేందుకూ నిధుల్లేవు. వైకాపా హయాంలో కొందరు సర్పంచులు అప్పులు చేసి మరి పనులు చేయించారు.