ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం గురుపూజ దినోత్సవం వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పగో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉపాధ్యాయులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ, జిల్లా ఎస్పీ ప్రశాంత శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు.