వరద విపత్తులో చిక్కుకున్న బాధితుల సహాయార్ధం ఆదర్శవంతమైన సేవలను స్పూర్తివంతంగా కొనసాగించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు నగరానికి చెందిన పలువురు వరద బాధితుల సహాయార్థం నిమిత్తం రూ.1, 35000 అందజేయడం జరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విజయవాడను ముంచెత్తిన వరద క్రమక్రమంగా తగ్గుతున్నా దాని తాలూకూ నష్టతీవ్రత మాత్రం ఇప్పట్లో పూడ్చలేనిదన్నారు.