జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఎవరైనా నాటుసారాని తయారు చేసిన అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.